పిల్లల పెంపకం తల్లిదండ్రుల పాత్ర

Dec 5, 2017

పిల్లల పెంపకం
పిల్లల పెంపకం అన్నది ఒక కళ, తల్లి దండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయస్సు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లలను ప్రతీ చిన్న విషయానికి కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారి మనస్సులలో మార్పుతీసుకురావాలి. చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భావి జీవిత పునాది ఏర్పడుతుంది.

పిల్లల పెంపకం గురించి పరిశోధకులు వెలువరించిన సత్యాలు

తల్లి తండ్రులు పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఉంటే, అట్టి పిల్లలు సమాజ మెప్పును పొందుతారు.  సమాజపరంగా ఎన్నో విజయాలను సాధిస్తారు.
పసికందుల పై ప్రతికూల ప్రవర్తనను తల్లితండ్రులు చూపించినట్లైతే, అటువంటి పిల్లలు బడిలో చేరినప్పుడే కలహాలకు పోయేవారిగా గుర్తించబడతారు. 5 సంవత్సరాల లోపు వయస్సులోనే ఇటువంటి తత్వం ఉంటే, వారు జీవిత పర్యంతం అలాగే ఉంటారు.
తల్లితండ్రులు కరుణ దయ గల స్వభావులైతే, పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్నే అలవరుచుకుంటారు. తల్లితండ్రులకూ ఈ గుణం ఉండటం చాలా అవసరం. పెంపకంలో ఉండే ప్రతి సమస్యను ఈ ధ్రక్పథంతొనే ఎదుర్కోవాలి.
పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉండే తల్లితండ్రులకు, సాధారణంగా యుక్తవయస్కులైన పిల్లలనుండి వచ్చే సమస్యలు ఎదురుకావని పరిశోధకులు చెప్తున్నారు. ఆంతేకాదు స్నేహపూరక వాతావరణం ఆరోగ్యానికి కూడా మంచిది.
యుక్తవయస్సు వచ్చాక పిల్లలు స్వేచ్చగా, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. తమ కార్యకలాపాలలో తల్లితండ్రులు జోక్యం చేసుకోవడం చాలమంది పిల్లలు ఇష్టపడరు. ఫరస్పరం స్నేహపూర్వకంగా ఉంటే తల్లితండ్రులకు పిల్లలపట్ల విశ్వాసం ఉంటుంది, పిల్లలు వారితో బాహాటంగా, నిష్కపటంగాఉంటారు.
అస్తవ్యస్తమైన వైవాహిక జీవితం గల వారి పిల్లలకు నిద్రకు సంబంధమైన సమస్యలు చిన్నవయస్సులోనే ప్రారంభమౌతాయి. కంటినిండానిద్రపోకపోతే వారిలో అలసట, చిరాకు, విసుగు, ఏకాగ్రత లేకపోవడం, చదువులో, అభ్యసనలో రాణించలేకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. బిడ్డలకోసమైన తల్లితండ్రులు ఒకరిపట్ల మరొకరు సహనవంతులై ఉండాలి.
తీవ్రమైన ఆందోళన, వత్తిడి సమస్యతో సతమతయ్యే తల్లులకు పెంపకం ఒక సవాలే. వారు పసిబిడ్డలు ఏడుస్తున్నా స్థబ్దుగా ఉండిపోతారు. ఫ్రతికూల పెంపకం అలవాట్లుగల తల్లులవలన పిల్లలోకూడా వత్తిడి మొదలౌతుంది.
తల్లితో భద్రతతోకూడిన అనుబంధంగల పిల్లలు అన్నివిధాలుగా అమోదం పొందుతారు. వారికి ఎటువంటిసమస్య వచ్చినా తల్లి దగ్గరకు పరిగెడ్తారు, ప్రవర్తనా సమస్యలనుకూడా అధిగమించగలుగుతారు. దీని ప్రభావం ఆడపిల్లలకంటే ఎక్కువగా మగ పిల్లల్లో కనిపిస్తుంది.
యుక్తవయస్కులు  తమ కాళ్ళమీద తామునిలబడాలనుకోడం అత్యాశకాదు. కానివారికి తల్లితండ్రుల సహాయ సహకరాలు చాలా అవసరం. ముఖ్యంగా తల్లులు అటువంటి చేయూతనిస్తే ఇంట్లోనే కాదు స్నేహితుల మధ్యకూడా వారు బాగా గుర్తించబడతారు.
తమ పిల్లలు అన్నివిధాలుగా పరిపూర్ణంగా ఉండాలనుకోవడం, ఒకవైపు పిల్లలకు, మరొక వైపు తల్లితండ్రులకు హింసే. పిల్లలను చాలా చక్కగా పెంచాలి, లేకపోతే సమాజం తమను చిన్నచూపు చూస్తుంది అనుకొనే తల్లి తండ్రులకు ఇంకా దారుణమైన హింస. ఎవరివైపునుండి కాకుండా తాము, తమ కుటుంబ వైపునుండి పిల్లలను చూడాలి.
తమకన్ని తెలుసు, తాము అనుకున్న విధంగా పిల్లలను పెంచుతాము అనుకుంటే అది పొరపాటు. ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కఠినంగా ప్రవర్తించే తల్లితండ్రుల పిల్లలకంటే, మృదు స్వభావం కలిగిన వారి పిల్లలకు చింతా, వ్యాకులత, ఆందోళన పరమైన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.

తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపం ఉన్నట్లైతే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించవలసి ఉంటుంది. కనుక ప్రతీ తల్లిదండ్రులకు పెంపక విధానాల గురించి, వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల పెంపక విధానాలు- పరిణామాలు

విమర్శలతో పెంచబడిన బిడ్డ తనను తాను దోషిగా తలుస్తాడు.
కోపతాపాలతో పెంచబడిన బిడ్డ కయ్యాలకు కాలు దువ్వుతాడు.
పరిహాసాలతో పెంచబడిన బిడ్డ పిరికివానిగా తయారవుతాడు.
అవమానాలతో పెంచబడిన బిడ్డ అభద్రతా భావానికి గురవుతాడు.
సహనంతో పెంచబడిన బిడ్డ క్షమాగుణాన్ని అలవరచుకుంటాడు.
ప్రోత్సహించి పెంచబడిన బిడ్డ ఆత్మ విశ్వాసంతో పెరుగుతాడు.
అభినందనలతో పెంచబడిన బిడ్డ ఎదుటివారిని గౌరవించి, విలువనివ్వటం నేర్చుకుంటాడు.
రక్షణాభావంతో పెంచబడిన బిడ్డ జీవితంపై దృఢమైన నమ్మకం పెంచుకుంటాడు.
నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ నీతిగా పెరగటం నేర్చుకుంటాడు.
స్నేహభావంతో పెంచబడిన బిడ్డ ఇతరుల ఎడల ప్రేమ భావాన్ని పెంచుకుంటాడు.
ప్రతి ఒక్క తల్లి తండ్రికి పై విధానాలను, వాటి పరిణామాల్ను గురించి తెలుసుకుని, తమ పెంపక విధానాలలోని లోటు పాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే వారు పిల్లల భావి జీవితానికి బంగారు బాట వేయగలుగుతారు.

పిల్లల పెంపకం - తల్లితండ్రులకు సూచనలు

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని సూచనలను పాటించినట్లయితే పెంపకం చాలా సులభమవుతుంది. పిల్లల వయస్సులను బట్టి వారి శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులు మారుతూ ఉంటాయి. వాటిని పెద్దలు సరిగా అర్ధం చేసుకోకపోవటం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూస్తారు. వారిలో వయస్సుతో వచ్చిన మార్పులను అర్ధంచేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లితండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి.

పిల్లల ప్రాధమిక అవసరాలను తీర్చటం తల్లితండ్రుల బాధ్యత.
పిల్లలకు వారి పనులు వారే స్వతహాగా చేసుకోవటం అలవాటు చేయాలి.
ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడిపి, వారు చెప్పేది విని, వారి ఆలోచనలను, అంతరంగాలను అర్ధం చేసుకోవాలి.

పిల్లలలో సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహించాలి.
పిల్లలందరిని సమానంగా చూడాలి, పక్షపాత వైఖరిని చూపకూడదు, ఇతర పిల్లలతో పోల్చి, కించపరిచితే వారు ఆత్మన్యూనతకు గురి అవుతారు.
ప్రతి విషయంలొ లోపాలను ఎత్తిచూపి, మందలించకూడదు. అలా చేస్తే వారు మొండిగా తయారవుతారు. వారికి మెల్లగా అర్ధం అయ్యేట్లు నచ్చజెప్పి మార్పును తీసుకురావాలి.
పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ, సరైన పాళ్ళలో ఉండాలి.
పిల్లలకు చదువు ఎంత అవసరమో, ఆటలు కూడా అంతే అవసరం. ఆటలు పిల్లల శారీరక మరియు మానసిక వృద్ధికి దోహదం చేస్తాయి.

పిల్లలలో తలెత్తే ప్రవర్తనా సమస్యలను తల్లిదండ్రులు సహృదయంతో అర్ధం చేసుకుని, వాటికి నివారణోపాయం ఆలోచించి పరిష్కరించాలి.
పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోవాలి, వారి స్నేహాలను గౌరవించాలి.
యుక్తవయస్కులైన పిల్లలను తల్లిదండ్రులు స్నేహితులుగా చూడాలి. వారి అభిప్రాయాలను, అభిరుచులను మన్నించి గౌరవించాలి.
ఈ సూచనలను పాటించినట్లయితే తల్లిదండ్రులకు, పిల్లలకు సరైన అవగాహన ఏర్పడి, పిల్లల పెంపకం ఆనందదాయకమవుతుంది.

పిల్లల చదువు - తల్లిదండ్రుల బాధ్యత

పిల్లల చదువుల విషయంలో పూర్వం తల్లిదండ్రుల పాత్ర తక్కువగానూ, ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగానూ ఉండేది. కానీ ఇంతకుముందుకు, ఇప్పటికీ పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వచ్చింది. అందువలన తల్లిదండ్రులకు, పిల్లల చిన్న వయస్సునుండే ఎక్కువ బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచం శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి, వారిచేత చదివించటం, హోంవర్కు చేయించటం చేయాలి. అంతేకాని దగ్గరుండి ప్రతీదీ మీరే చేయకూడదు. దానివలన పిల్లలకు లాభంకంటే నష్టం ఎక్కువ.

పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి.
కొంతమంది పిల్లలు కొన్ని పాఠ్యాంశాలు చదవటానికి కష్టపడుతుంటారు. వారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన శిక్షణ ఇవ్వాలి. అంతేకాని వారిని కించపరిచి, హేళన చేయకూడదు. అలా చేస్తే వారు నూన్యతాభావానికి గురవుతారు.
చిన్నప్పటినుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి, వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి.
పిల్లల పాఠశాలలకు వెళ్ళి, వారి ఉపాధ్యాయులను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించాలి.
పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషమైన ప్రతిభ కనబరిచినపుడు వారిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడు వారికి శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు, అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి.
తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను ఆశించకూడదు.
చదువుతోపాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి, మానసికాభివృద్ధి పెంపొందుతాయి.
మన చేతివేళ్ళన్నీ ఒకలాగే ఉండనట్లే, మన పిల్లలంతా ఒకలాగే ఉండరు, అయినా తల్లిదండ్రులు సమానంగా చూస్తూ చదివించినట్లయితే పిల్లలు చక్కగా చదివి, మంచి పేరు తెచ్చుకుంటారు. " నేటి బాలలే రేపటి పౌరులు " అన్న విషయం అందరికీ తెలిసిందే.
కనుక చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణపైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లల పెంపక విషయంలో ఈ సూచనలన్నీ పాటిస్తే వాళ్ళు చాలా చక్కగా పెరుగుతారు అలాగే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అందంగా మార్చుకుంటారు.

పిల్లలను వద్దని వారించడం ఎలా?
వద్దన్నానా?! లే అక్కడ్నుంచి
చెయ్యొద్దంటే వినవేంటి?
ఒక్కసారి వద్దంటే ఎప్పుడూ వినవు కదా?
చెయ్యొద్దన్న పనే చేస్తానంటావు; ఎప్పుడు నేర్చుకుంటావు మాట వినడం?
ఇపుడు నేను ఏది ఇవ్వను, రేపు చూద్దాం !
పెట్టింది తిను, చెప్పింది చెయ్యి - అది కావాలి, ఇది కావాలి అంటే ఎక్కడ్నుంచి వస్తుంది?
ఇప్పుడు కాదు రేపు వెళ్దాం?
ఇవన్నీ చదువుతుంటే ఏమన్నా గుర్తొస్తుందా?
కొందరికి వచ్చి ఉంటుందిలే!
ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, మారాం చేస్తున్నప్పుడు అరుస్తూ, కోప్పడుతూ, అనే మాటలు.
అన్ని మాటల్లో ' వద్దు ' అనే సంకేతం పిల్లలకు కనిపిస్తుంది.
ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు; నిగ్రహాన్ని కోల్పోయి, కోప ప్రకోపాలను చూపుతారు.
తల్లిదండ్రుల నోట్లోనుంచేమో వద్దు అనే మాట చాలా సులువుగా వస్తుంది.
పిల్లల ప్రవర్తనను విశ్లేషించే మానసిక శాస్త్రవేత్తలేమంటారంటే, “తల్లిదండ్రులు వద్దు అనే పదాన్ని వాడుతూంటే, ఆ పదం యొక్క పరమార్ధాన్ని గ్రహించే సున్నితత్వం పిల్లలలో నశించిపోతుంది”  అని. ఆ పదాన్ని పిల్లల విషయంలో ఎంత పొదుపుగా వాడాలంటే ఆ మాట చెప్తే తప్ప పిల్లలు సమస్య నుంచి లేదా నష్టం కలిగించే పరిస్థితి నుంచి బయటపడరు అనుకునే సంధర్బంలోనే, మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనుకున్నప్పుడే వాడాలి.
ఇది చదవగానే చాలమంది తల్లితండ్రులు మా పిల్లల సంగతి ఈ రాసిన వాళ్ళకేం తెలుసు, ఒక గడియ వాడితో గడిపితే తెలుస్తుందని అనుకుంటూండవచ్చు.
బయట బజారుకు తీసుకెళ్తే బొమ్మల దగ్గర ఆగిపోతారు, కొనివ్వమని గొడవ చేస్తారు. కిందపడి దొర్లుతారు, పోని కొనిచ్చామా !? దాంతో ఆడుకోరు. మళ్ళీ ఇంకో బొమ్మ, ఇంకో బొమ్మ, ఇలా ఎన్నో బొమ్మలతో ఇల్లు నిండిపోతుంది. మరి వద్దు అనకుండా ఉండటమెలా  ????.
ఎవరింటికైనా తీసుకెళ్తే వాళ్ళ పిల్లల బొమ్మలో, పుస్తకాలో మరేదో కావాలని మారాం చేస్తారు. వద్దంటే ఏడుస్తారు. అది ఇద్దరికీ సమస్యే!

పెన్సిలు పారేస్తే రేపు మరొకటి కొనిపెట్టను”  అని చెప్పి పంపుతారు, తప్పకుండా పారేసుకొస్తారు. పారేసుకొచ్చాక మళ్ళీ పాతపాటే.
కాస్త అటు ఇటుగా ఏ తల్లిదండ్రులను కదిలించినా ఏకరువు పెట్టే విషయాలివే.
వాళ్ళు పిల్లలు  !ఏది మంచో, ఏది చెడో వాళ్ళకు తెలియదు. అందరూ ఆ స్థితిలో ప్రయాణించి, దాటి తల్లిదండ్రుల దశకు చేరుకునేవారే.
వాళ్ళు పెద్ద వాళ్ళు లాగా ఎలా ఉండగలరు? ఉండగలిగితే వాళ్ళు పిల్లలు కారు పెద్దలౌతారు.
వద్దని చెప్పకుండానే పిల్లలలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి?
ప్రత్యామ్నాయాలని, పరిష్కారాలను చూపించండి.
ఇప్పుడు నువ్వు ఆ పని మానేస్తే నీకు నేను ఐస్ క్రీం, చాక్లెట్లు కొనిస్తాను, పార్కుకు తీసుకెళ్తాను అని చెప్పి చూడండి. చెప్పింది మాత్రం తప్పక చేయండి.
ఇంకా, ఐస్ క్రీం కావాలా, చాక్లెట్లు కావాలా, బొమ్మ కావాలా, సినిమాకెళ్ళాలా, పార్కుకెళ్ళాలా అంటూ చాలా ప్రత్యామ్నాయాలను చూపి, ఏం కావాలో కోరుకోమనండి. దాంతో కొంతవరకు అదుపులోకి వస్తారు. అంతే కాని వద్దు అనే పదం వాడకండి. అది పిల్లలను అనుకూల దిశలో అలోచించనివ్వదు.
వాళ్ళకు మంచి, చెడు ప్రవర్తన పట్ల వ్యత్యాసం అంతగా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రవర్తించడం. పిల్లలు ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారో, పిల్లలు ఎలా ఉంటే అందరూ ఇష్ట పడతారో  పిల్లలకు బోధపరచండి. పిల్లలతో కూర్చుని ఎందుకు చేయకూడదో వివరించండి. అపుడు మీ బిడ్డ కూడా తన భావాలను మీతో పంచుకుంటాడు. ఇదిగో ఇక్కడే ప్రతికూల ప్రవర్తన, ఆలోచనలు మారి, అనుకూలంగా మారడానికి బీజం పడుతుంది.
పిల్లలు ఏడుస్తూనో, అరుస్తూనో తమ ప్రకోపాన్ని వెల్లడిస్తున్నపుడు అడ్డు తగలకండి! అలాంటి సమయంలో మీరు ఏమి మాట్లాడినా పిల్లలు వ్యతిరేక భావంతోనే అర్ధం చేసుకుంటారు. ఆ కోపపు తుఫాను ఆగి, బిడ్డ మామూలు అయ్యేంత వరకూ ఆగండి; ఈ లోపల మీరు బిడ్డతో ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ బిడ్డతో మాట్లాడండి, తన ఉద్వేగం నుండి వెలుపలికి రావడానికి సహాయం చేయండి.
పిల్లలు సాదారణంగా ఉక్రోషాన్ని కోపాన్ని ప్రదర్శించే సందర్భాలు, ఎలాంటి సమయాలలో వీటిని ప్రదర్శిస్తారో మీకు అనుభవం ఉండే ఉంటుంది. సాధారణంగా ఆకలి వేసినపుడు, అలసిపోయినప్పుడు, విసుగు వచ్చినప్పుడు అలా చేస్తుంటారు.. కనుక ముందుగానే జాగ్రత్తపడి ఆకలేస్తే ఇవ్వడానికి తినుబండారాలు, అలసట, విసుగు కలిగినపుడు వారి దృష్టి మళ్ళించే కొత్త ప్రయత్నాలు, మార్గాలు ఆలోచించుకుని సిద్ధంగా ఉండాలి.
పిల్లల మీద చెయ్యెత్తడం, కొట్టడం అస్సలు పరిష్కార మార్గాలు కావు. వీటి వలన లాభం కాదు కదా నష్టమే ఎక్కువ. అలా చేస్తే పిల్లలు చివరకు నేర్చుకునేది ఏమిటంటే తమకు కోపం వచ్చిన సందర్భాలలో అలాగే దాడి చేయడమే సబబైన మార్గమని. కాబట్టి పిల్లలను కొట్టడమనేది వారిని చెడగొట్టడమే అవుతుంది.
నిశ్శబ్దంగా ఉండండి పిల్లలు విసిగిస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రులు పళ్ళు నూరడం, అరవడం, పూర్తిగా వాళ్ళతో మాట్లాడడం మానివేయడం చేస్తుంటారు. వెంటనే వీటిని ఆపివేయండి. ప్రత్యామ్నాయంగా నిశ్శబ్దంగా ఉండండి. ఇలా ఉండడం చాలా కష్టం; కాని పిల్లల మేలు కోసం మానుకోవాలి. పరిస్థితి చల్లబడ్డాక వారితో మాట్లాడండి.
మంచి ప్రవర్తనకు బహుమానాలు, అభినందనలు ఇచ్చినట్లుగా చెడు ప్రవర్తనకు కొన్ని పర్యవసానాలుంటాయని పిల్లలకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంకొంచం ఎక్కువసేపు ఆడుకుంటామంటే, ఆడుకో కాని ఎంత ఎక్కువ సేపు ఆడుకుంటే అంతసేపు టి. వి. చూడకూడదని, లేదంటే అంతసేపు అదనంగా చదువుకోవాలని చెప్పడం వంటివి. మీరు ఏమి సూచిస్తారో అది తప్పకుండాఅమలు చేయండి. లేకపోతే అమ్మ, నాన్న ఎన్ని చెప్తారో కాని ఏది చెయ్యరు, ఒట్టొట్టి మాటలే అనే భావన పిల్లలలో కలుగుతుంది.
పిల్లలకు సంకేతాలు పంపిస్తూ ఉండండి. మరొక ఐదు నిమిషాలలో ఆటలు ఆపేసి వచ్చేయాలి, ఈ కార్యక్రమం అయ్యాక టి. వి ఇక ఆపేయాలి, ఇంకొక పది నిమిషాలలో మనం ఇంటికి బయలుదేరాలి అని చెప్తుండాలి. అందువలన పిల్లలు తాము చేస్తున్న దానిని ముగింపు చేస్తారు.
పిల్లలనుండి వస్తువులు లాక్కోకండి. ఒక్కోసారి పిల్లలు తాము ఆడుకోకూడని వస్తువులతో ఆడుకుంటుంటారు.ఉదాహరణకు సెంటు సీసాలు, మందు సీసాలు, పదునుగా ఉండే వస్తువులు మొదలైనవి. అలాంటప్పుడు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర్నుంచి వాటిని లాక్కోకూడదు. అలా లాక్కుంటే వాళ్ళకు కోపం వస్తుంది. ఉక్రోషాన్ని ప్రదర్శిస్తారు. ఇందుకొక మంచి మార్గమేమంటే, వారితో ఆ వస్తువుకు బై బై చెప్పించి ఒక ముద్దు పెట్టించి, మళ్ళీ రేపు ఆడుకుంటానని దానికి చెప్పించి, ఎక్కడ్నుంచి తీశారో అక్కడ పెట్టించడం. ఇంతచేసినా పిల్లలు వాటితోనే ఆడుకుంటామని గొడవ పెడ్తుంటే మరొక వస్తువు వైపు దృష్టి మరల్చాలి.
పొదుపు అలవాటు చేయండి. కొందరు పిల్లలు బయటకు వెళ్ళినపుడల్లా ఏదొక బొమ్మ కొనిపెట్టమని గొడవచేస్తారు. షాపులో కిందపడి దొర్లుతుంటారు కూడా. ముందుగానే పిల్లలకు బొమ్మలు కొనుక్కోడానికి డబ్బు పొదుపు చేయడం నేర్పించండి. కిడ్డీ బ్యాంకులో డబ్బుంటే దాంతో కొనుక్కోవడం నెమ్మదిగా అలవాటు చేయాలి.

సదుపాయాలు, వినోదాలనుండి వారిని దూరం చేయకండి. బయటకు తీసుకువెళ్ళినపుడు పిల్లలు అల్లరి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకెళ్ళడం మానేస్తారు. అది అస్సలు మంచి పద్దతి కాదు. బయటకు వెళ్ళినపుడు ఎలా ఉండాలో పదే పదే చెప్పడం ద్వారా పిల్లలు తప్పకుండా అర్ధం చేసుకుంటారు. మొదట్లో కొన్ని సార్లు ఇబ్బందైనా రాను రాను తప్పకుండా నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ఆచరిస్తారు.
పిల్లల అభివృధ్ధిలో తల్లిదండ్రుల పాత్ర
ఈరోజుల్లో చాలా ఇళ్ళలో తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉద్యోగానికో, పనికో వెళ్ళి తీరికలేని సమయం గడుపుతున్నారు. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత మిగిలిన సమయాన్నిఇంటిపనులకూ, టీ.వీ. చూడడానికీ వెచ్చిస్తున్నారు. అలాగే ప్రొద్దున్నే బడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరిన పిల్లలు కూడా టీ.వీ. చూస్తూనో, సెల్ ఫోనుల్తో ఆడుకొంటూనో సమయాన్ని గడిపేస్తున్నారు.  దీనివలన తల్లిదండ్రులకూ పిల్లలకూ మద్య కొంత 'దూరం' ఏర్పడుతుంది. ఈదూరం భౌతికమైనదికాదు, శారీరకమైనది, మానసికమైనది. పక్కపక్కనే ఉంటూ, ఒకరినొకరు చూసుకొంటూ స్పందించని వస్తువులతో గడపడం వలన ఏర్పడుతుంది.

ఈ దూరంవలన

తల్లిదండ్రులూ, బిడ్డలూ తమ మద్య ప్రేమను అనుభవించడం లేదు.
క్రమేణా 'నేనుఒంటరిని’ అనే భావన బిడ్డలలో కలుగుతుంది. అది అభద్రతా భావనకు దారి తీస్తుంది.

తల్లిదండ్రులు తమ బిడ్డలలో జరుగుతున్నపెరుగుదలను గ్రహించలేరు, అవసరాలను గుర్తించలేరు.
బాల్యం యొక్క తీయదనాన్ని, అనుభవాలనూ ఇరువురూ ఆనందించలేరు.
పిల్లలు తాము పగటి సమయంలో అనుభవించిన భావోద్వేగాలు అంటే - ఆనందం, దుఃఖం, భయం మొదలైనవి వ్యక్తపరచలేకపోవడం వలన అవి గుప్తంగా ఉండిపోయి భవిష్యత్తులో ప్రవర్తనా సమస్యలుగా మారవచ్చు. ఉదాహరణ: గోళ్లుకొరకడం, నోట్లో వేలు పెట్టుకొని చీకడం, పక్క తడపడం, కొట్టడం, అబద్దాలు చెప్పడం, దొంగతనం చేయడం, మొండితనం మొదలైనవి.

భార్య, భర్తా, పిల్లల మద్య అప్యాయతానురాగాలు క్రమేణా క్షీణించి యాంత్రికమైన జీవితం గడుపుతారు.  

తల్లిదండ్రులు తమ తమ పనులు చేసుకొంటూనే, వారి పిల్లలతో నాణ్యమైన సమయాన్ని ఎలా గడపవచ్చు? ఇలా గడపడం వలన అది వారి పిల్లల “సంపూర్ణాభివృద్ధి”కి ఎలా ఉపయోగపడుతుంది?

సంపూర్ణాభివృద్ధి అంటే పిల్లలలో శారీరకాభివృద్ధి (కండరాల సమన్వయం)మానసికాభివృద్ధి (తెలివితేటలు)సాంఘికాభివృద్ధి (సామాజిక అభివృద్ధి)భాషాభివృద్ధి (భాషపై పట్టు)నైతికవిలువలు (మంచిచెడులు)సృజనాత్మకత – వీటన్నిటినీ పెంపొందించడం.

మనిషి పుట్టినప్పటి నుండీ చనిపోయే వరకూ జరిగే మెదడు అభివృద్ధిలో ఎనభైశాతం అభివృద్ధి  దాదాపుగా  ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే జరుగుతుంది.  కనుక బాల్యంలో ఆహ్లాదకరమైనఆరోగ్యవంతమైన పరిసరాలు, అనుభవాలూ ఎంతో ముఖ్యము. సంపూర్ణవికాసానికి అటు కుటుంబం మరియు పాఠశాల  రెండూ ప్రధాన పాత్ర వహించాలి.  ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ వారి అభివృద్ధికి ఉత్ప్రేరణ కలిగిస్తారో అటువంటి కుటుంబాలలో పిల్లలు భద్రతా భావంతో పెరుగుతారనీ, భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారనీ చాలా పరిశోధనలలో తేలింది .

ఎలాంటి కార్యక్రమాలు, ఆటలు ద్వారా పిల్లలకు సంపూర్ణవికాసాన్ని కలిగించవచ్చు?

A. శారీరక అభివృద్ధి అంటే శరీరంలో చిన్నపెద్ద కండరాల అబివృధ్ధి, కంటికీ చేతికీ మద్య సమన్వయం ఏర్పరచే కొన్ని ఆటలుపనులు చేయించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.  వారి పనులు వారు స్వతంత్రంగా చేసుకోవడానికీ, ఆటలుక్రీడల పోటీల్లో విజేతలవడానికీ శారీరకంగా అబివృధ్ధి చెందడం ఎంతో అవసరం.  అందుకోసం

పిల్లలు రోజూ కొంతసేపైనా అన్నదమ్ములూ, అక్కచెల్లెల్లతో కానీ, ఒక్కరే ఉంటే చుట్టుప్రక్కల పిల్లలతో కానీ ఆడుకొనేలా  చూడాలి.

శిశువులకు నడక వచ్చేటపుడు తోపుడు బండి, చక్రాల బండి వంటివి నడక నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి.
నడక వచ్చిన పిల్లలకు పెద్దలు దగ్గర ఉండి మెట్లు ఎక్కడం దిగడం నేర్పించవచ్చు.
ఫరిగెత్తడం, కుంటడం, గెంతడం వంటి పనులు పెద్దకండరాల అభివృద్ధికి ఉపయోగపడతాయి.
3 సంవత్సరాల పిల్లలు మూడు చక్రాల  సైకిల్ తొక్కగలుగుతారు. ఇది వారి ఎముకలు, కండరాల అభివృద్ధికి మంచిది.

చిన్న కండరాల అబివృద్ధికి కాగితాలు చింపడం, కత్తిరించడంబొమ్మలు వేయించడం వంటి పనులు చేయించవచ్చు. పిండితో బొమ్మలు చేయించవచ్చు – తల్లులు రొట్టెలు, చపాతీలు చేస్తున్నపుడు కొంత పిండి పిల్లలకు ఇచ్చి వారినీ చేయమనవచ్చు.  
B. సామాజిక అభివృద్ధి కోసం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కాని ఇప్పుడు సంపాదన కోసం, నిత్యం పెరిగే ధరలను తట్టుకోవడం కోసం చాలామంది వారి ఉమ్మడి కుటుంబాలను విడిచి దూరంగా ఉంటున్నారు.  ఉమ్మడి కుటుంబాలలో పెరిగే పిల్లలు వాళ్ళ అమ్మనాన్ననాన్నమ్మతాతయ్యఅత్తలూ, మావయ్యలూవారి పిల్లలతో కలిసి పెరిగేవారు.  అలా పెరిగే పిల్లలకు సహజంగానే సామాజిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.  వారికి పంచుకోవడంఇతరులతో కలసి పనులు చేయడం వంటి లక్షణాలు అలవడతాయి. మరి చిన్నకుటుంబాలలో పెరిగే పిల్లలు వారిదే ప్రపంచంగా పెరుగుతున్నారు.  వారి వస్తువుల్ని కానీ, బొమ్మలను కానీ ఇతరులను తాకనివ్వరు.  ఇటువంటి పిల్లలకు

చుట్టుపక్కల పిల్లలతో కలిసి తరచుగా ఆడుకొనేలా అవకాశాలు కల్పించాలి.
వారి వస్తువుల్ని, బొమ్మల్ని వేరే పిల్లలతో ఇచ్చి పుచ్చుకొనేలా అవకాశాలను ఏర్పరచాలి.
పిల్లలను బంధువుల ఇళ్ళలో జరిగే శుభకార్యాలకూ, కార్యక్రమాలకూ తరచుగా తీసుకెళ్ళి అక్కడ అందరితో కలుసుకొనేలా చూడాలి.
వారి వయస్సున్న పిల్లలను ఇంటికి ఆహ్వానించి వారితో ఆడుకొనేలా చూడాలి.
C. మానసికాభివృధ్ధి అంటే తెలివితేటల్ని పెంపొందించడం.  దీనికోసం

చిన్న పిల్లలకు చుట్టుప్రక్కల జరిగే విషయాలపై చాలా కుతూహలం ఉంటుంది, దీని వలన తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు.  తల్లిదండ్రులు వారి సందేహాలను ఓపిగ్గా తీర్చాలి.  దీని వలన వారి తెలివితేటలు పెంచవచ్చు. అలా కాకుండా పిల్లలు ప్రశ్నలడుగుతున్నపుడు విసుక్కొంటే కొన్నాళ్ళకు వారు ప్రశ్నలడగడం ఆపేస్తారు, వారిలో కుతూహలం పోతుంది.
బడికి వెళ్ళే పిల్లలకు పుస్తకాల్లోశీర్షికల్లో వచ్చే తేడాలు కనిపెట్టండి, దారి చూపింఛండిపజిల్స్సూడోకో వంటివి కత్తిరించి వారితో చేయిస్తుండాలి.
ఖాళీ సమయాల్లో లేదా వంట చేసుకొంటూనోగిన్నెలు తోముకొంటూనో పిల్లలతో సంభాషిస్తుండాలి. మెదడుకు పదును పెట్టేపొడుపుకథలూప్రశ్నలడగడం వంటివి చేయవచ్చు. ఇవి వారి తెలివితేటలు మరియు భాషాభివృధ్ధికి ఎంతగానో సహాయపడతాయి.
ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని కలిపి, ఉదాహరణకు కొన్నిరకాల పప్పులు, చింతగింజలు, బటన్స్, నాణాలు, చిన్న గులకరాళ్ళూ వంటివి కలిపి వాటిని వేరు చేయమనడం, జతపరచడం, పరిమాణాన్ని బట్టి అమర్చడం, కళ్ళుమూసుకొని కొన్ని వస్తువుల పేర్లు తిరిగి చెప్పమనడం వంటి పనులు తల్లిదండ్రులు వారి వారి పనులు చేసుకొంటూనే చేయించవచ్చు.  దీనివలన పిల్లల తెలివితేటలూజ్ఞాపకశక్తీ మెరుగవుతాయి.
పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి

పిల్లలకు చిన్న వయసులోనే మంచి చెడులపై అవగాహన కలిగించాలి.
తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చేసే ప్రతీ పనీ వారి తల్లిదండ్రులను చూసి అనుకరిస్తుంటారు. కనుక తల్లిదండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలను నేర్చుకొంటారని ఎన్నో పరిశోధనలు తెలియచేసాయి.
పురాణ కథలు, నీతి కథలను చెప్పడం ద్వారా, పిల్లలకు తమ అనుభవాల నుండి ఉదాహరణలివ్వడం ద్వారా మంచి చెడులకు గల తేడాలను తెలియచేయవచ్చు.
చిన్న పిల్లల కథల పుస్తకాలు కొని, రాత్రి పడుకొనే ముందు రోజూ ఒక మంచి కథ చెప్పవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకు భాషాభివృధ్ధినైతిక విలువలూ మరియు భద్రతా భావం కలిగించవచ్చు.
అలాగే రాత్రి భోజన సమయాన్ని కూడా చక్కగా గడపవచ్చు.  సాద్యమైనంత వరకూ అందరూ కలసి భోజనం చేసేలా చూడాలి.  టీ.వీ.  చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు, దీనికి బదులు ఆరోజు జరిగిన విశేషాలను కుటుంబంలో అందరూ కలిసి పంచుకొంటూ భోజన సమయాన్ని గడపవచ్చు. పిల్లలను వారి స్కూల్లో ఆరోజు జరిగిన విశేషాలను మాట్లాడమని ప్రోత్సహించవచ్చు.  క్రింద పడకుండా శుభ్రంగా భోజనం చేయడంభోజనం ముందూ, తరువాతా శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలి.

పిల్లల వ్యక్తిగత అభిరుచులూ, ఆసక్తిని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆయా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రోత్సహించాలి.  ఉదాహరణకు పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజారులో దొరికే కొత్తరకాల రంగులూబొమ్మల పుస్తకాల వంటివి కొని వారిని ప్రోత్సహించవచ్చు. బొమ్మల పోటీలు నిర్వహించే ప్రదేశాలకు వారిని తీసుకెళ్ళి వాటిలో పాల్గొనేలా  ప్రోత్సహించాలి. అలాగే మన అభిరుచులను వారిపైకి రుద్దకుండా స్వతహాగా వారిలో ఉండే ఆసక్తులను గమనించి ప్రోత్సహించాలి.  దీనివలన పిల్లలలో సృజనాత్మకత మెరుగవుతుంది. రకరకాల పోటీలలో పాల్గొని ముందుండే పిల్లలు చదువులో కూడా ముందుంటారు.  

ఈవిధంగా మనకు తెలియకుండానే తీరిక లేకుండా గడచిపోయే మన దైనందిన జీవితంలో కొంత విలువైన సమయం పిల్లల సంపూర్ణాభివృధ్ధికి కేటాయించాలి.  మరి అదే సమయం పిల్లలు సెల్ ఫోనుల్తో, కార్టూన్ ఛానల్స్ తో గడపడం వలన వచ్చేవి - తలనొప్పి, కంటి చూపు మందగించడం, ఊబకాయంఅలసటహింసాత్మక ప్రవర్తన, మొండిగా ఉండడం, అభద్రతా భావం వంటివి వస్తాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రధ్ధ చేయకుండా తమపనులు చేసుకొంటూనే వారితో మాట్లాడుతూచిన్న చిన్న పనులను చేయిస్తూ వారి అభివృద్ధికి ఆసరాగా ఉండాలి.

తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, బాలికలలో లైంగిక వేధింపులను ఎదుర్కునేందుకు అవసరమైన నైపుణ్యాన్ని, ధైర్యాన్ని  పెంపొందించాలి. అమ్మాయి లైంగిక వేధింపులను గురించి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం చెయ్యి, లేదా పట్టించుకోకుండా వదిలేయి అని మాత్రం చెప్పకూడదు. అత్యవసర సేవల కోసం స్రీల హెల్ప్ లైన్ 1091 నంబరుకు డయల్ చేయండి .
లైంగిక వేధింపుకు గురైన బాలికతో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తీర్పునిచ్చే విధంగా కాకుండా అనుకూల స్పందనలతో, ఆసరా నిచ్చే విధంగా వ్యవహరించి, ఎవరో చేసే తప్పుడు పనులకు, ప్రవర్తనలకు వారి తప్పేంలేదని  బాలికలకు తోడుగా వుండాలి.

సాధారణంగా పిల్లల్లో కనిపించే  ప్రవర్తనా లోపాలు :
 సాధారణంగా కొన్ని ప్రవర్తనాలోపాలు చిన్న వయస్సులో ఉండి వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతాయి. ఉదాహరణకు పక్కతడపడం(bedwetting), వేళ్ళు నోట్లో పెట్టుకోవడం(thumb sucking).
పిల్లల్లో ప్రవర్తన లోపాలకు గల కారణాలు :
1. తల్లిదండ్రుల తీరు, ప్రవర్తన:
తల్లిదండ్రులు పిల్లలను ద్వేషించినట్లు ప్రవర్తించడం, గొడవపడటం, తిరస్కరించడం, అతిగా డిమాండ్ చేయడం, పిల్లల మధ్య భేదం చూపించడం, అతిజాగ్రత్తగా ఉండటం, అతి ప్రేమ చూపడం వల్ల ఇవన్నీ పిల్లల్లో ప్రవర్తనాలోపాలకు దారితీస్తాయి. మరియు పిల్లలకు సంబంధించిన విషయాల్లో తల్లిదడ్రులు తరచూ గొడవపడటం, పిల్లలముందే గొడవపడటం వల్ల పిల్లల్లోఆతురత(anxiety), పక్కతడపడం(bedwetting) వంటి ప్రవర్తన లోపాలు కనిపిస్తాయి.

2. శారీరక సంబంధమైన లోపాలు: (physiological causes)
శారీరక సంబంధమైన లోపాలు చెవులు వినబడకపోవడం(deaf), చాలా పొడవుగా ఉండటం, మొర్రి పెదవి, తొర్రి ఉండటం. ఇటువంటి పిల్లలు అధికంగా మాట్లాడటం, పొగరుబోతుతనం, పనులు ఆలస్యంగా చేయడం, అతిగా భయపడటం, దొంగిలించడం వంటి పనులు చేస్తూ ఇతరుల శ్రద్ధ తమపై ఉండాలని ప్రవర్తిస్తారు. ఈ శారీరక సంబంధమైన లోపాలు పిల్లల్ని మామూలు పిల్లల్లాగా ఆడుకోవటానికి ఆటంకపరుస్తాయి. అందువల్ల పిల్లలు తల్లిదండ్రులు/ఇతర కుటుంబ సభ్యులను బెదిరించడం, తొదరపెట్టడం, హింసించడం వంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పోషకాహారలోపం వల్ల రక్తంలో కొన్ని రసాయనాల వల్ల పిల్లలు చికాకుగా, కోపంగా ప్రవర్తిస్తారు.
3. అభద్రతా భావంతో ఉండటం:
తల్లిదండ్రులు పిల్లలపై తగినంత ప్రేమ చూపకపోవడం వల్ల, తరచు శిక్షించడం(దండించడం) వంటి ప్రవర్తన వల్ల పిల్లల్లో అభద్రతా భావం కలుగుతుంది. ఇలాంటి పిల్లలు దొంగిలించడం, కోపంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులపైన ఇతర కుటుంబ సభ్యులపైన ప్రతీకారం తీర్చుకుంటారు. మరియు కొన్ని సంధర్భాల్లో వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, గోళ్ళు కొరకడం వంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు తరచూ పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం వల్ల వారిలో అబధ్రతాభావం పెరుగుతుంది.
4. మార్గదర్శకత సరిగా లేకపోవడం:
పిల్లలు తరచు తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను అనుకరిస్తూ ఉంటారు. ఏవైనా ప్రవర్తనాలోపాలను తల్లిదండ్రులుగాని ఇతర కుటుంబసభ్యులుగాని కనబరిచినప్పుడు పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు.
5. పూర్వ అనుభవాలు:
ఫ్రాయిడ్(Freud) అనే మనస్తత్వ శాస్త్రవేత్త  ప్రకారం కొన్ని ప్రవర్తన లోపాలు అంటే భయపడటం, ప్రక్కతడపటం వంటి ప్రవర్తనలు చిన్న వయస్సులో కొన్ని సంఘటనల వల్ల పూర్వ అనుభవాలవల్ల జరుగుతాయి.
పిల్లల్లో సాధారణంగా కనిపించే ప్రవర్తన లోపాలు, ఇబ్బందికరమైన ప్రవర్తనలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రవర్తన లోపాలు/ఇబ్బందికరమైన ప్రవర్తనలు

పిల్లలు ప్రవర్తించే తీరుకు అర్ధం

చేయకూడనివి

చేయవలసినవి

1. ఇతర పిల్లలను గాయపరచినప్పుడు వారిని చీవాట్లు పెట్టడం, గాయపరచడం, కోపంగాప్రవర్తించడం చేయకూడదు.
బిడ్డను అక్కడినుండి తీసుకువచ్చి వారి చేతిలో ఏమైనా గాయపరిచే వస్తువులు ఉంటే వాటిని బిడ్డకు దూరంగా ఉంచాలి. బిడ్డ సంతోషంగా ఆడుకునే ఏర్పాటు చేయాలి. కోపపడకుండా ప్రేమతో నచ్చచెప్పాలి.

2. వస్తువులను పగలగొట్టడం

అసూయ, ఆతురత, విసుగు, అత్యుత్సాహం కారణంగా పిల్లలు వస్తువులను పగలగొడతారు. అప్పుడు వారిని తిట్టడం, చీవాట్లు పెట్టడం, కేకలు వేయడం, శిక్షించడం చేయకూడదు.
పగిలే వస్తువులను దూరంగా ఉంచాలి. బిడ్డ ఆడుకోవడానికి అనువైన ప్రదేశం కల్పించాలి. బిడ్డను క్రొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళాలి. బిడ్డ ఆడుకోవడానికి కొన్ని వస్తువులను ఏర్పాటు చేయాలి. మరియు ఎటువంటి పనులు చేయాలో చేయకూడదో చెప్పాలి.

3. చెడు మాటలు మాట్లాడటం : పిల్లలు ఇతరులను అనుకరించడం, ఇతరుల(ఏకాగ్రత)దృష్టి తన మీద ఉండాలని ప్రయత్నించడం కోసం అలా మాట్లాడతారు. అప్పుడు అసహనంతో ఉండటం, చికాకుగా ఉండటం, చీవాట్లు పెట్టడం, శిక్షించడం పదే పదే విసిగించడం వంటివి చేయరాదు.
పిల్లలు అన్న మాటలను అర్ధం చేసుకొని, అటువంటి మాటలు అనకూడదు అని నెమ్మదిగా చెప్పాలి. పిల్లలకు రైమింగ్ పదాలను, ప్రాసతో కూడిన పదాలను నేర్పించడం చేయాలి.(ఉదాహరణకు అల, వల, కల, పలక, అలక)

4. ఇతరులతో ఇచ్చి పుచ్చుకోని తత్వం(భాగ స్వామ్యం లేకపోవడం)
చిన్నప్రాయం అవ్వటం వల్ల ఇతరులకు ఇవ్వడం, తీసుకోవడం వంటివి తెలియకపోవడం.
బిడ్డకు (ఇతరులతో పంచుకోవడం),ఇతరులకు ఇవ్వడం అంటే ఇష్టపడే విధంగా అర్ధమయ్యే విధంగా నచ్చచెప్పాలి. మరియు సొంత వస్తువులను గురించి తెలియజేయాలి. బిడ్డకు భద్రతా భావం కలుగచేయాలి. దొంగతనం చేయకూడదని చెప్పాలి.

5. బ్రొటన వేలు నోట్లో పెట్టుకోవడం - పిల్లలు విసుగు చెందడం, వారికి ఆకలి వేయడం, బిడ్డ తన మీద ప్రేమ చూపాలనుకోవడం వంటి కారణాలతో అలా చేస్తారు. అప్పుడు వారిని శిక్షించడం, చీవాట్లు పెట్టడం, వేళ్ళను కట్టి వేయడం, వేళ్ళకు చేదుగా ఉన్న పధార్ధం రాయడం వంటి పనులు చేయకూడదు.
వేళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు తనమీద శ్రద్ధ, ప్రేమ తగ్గిపోయిందని అభద్రతా భావం కలిగి ఉన్నాడని అర్ధం చేసుకుని తగినట్లు అతనికి ప్రేమ, వాత్సల్యం చూపాలి.

6. పక్కతడపడం

భయం, అభద్రతాభావం,బిడ్డకు మూత్ర విసర్జనలో శిక్షణ లేకపోవడం వలన అలా పక్కతడుపుతారు. అప్పుడు వారికి చీవాట్లు పెట్టడం, పెద్దగా అరవడం, బలవంతంగా మూత్ర విసర్జనకు వచ్చినప్పుడు తెలియజేయాలని చెప్పడం వంటి పనులు చేయరాదు.
బిడ్డ ఎదిగిన కొద్దీ మూత్ర విసర్జనకు వెళ్ళడం అలవాటు చేసుకుంటుందని అర్ధం చేసుకోవాలి. బిడ్డకు తగినంత స్వేచ్చను ఇవ్వాలి. స్వతంత్రంగా పెరగడానికి పరిస్థితులు కల్పించాలి.

7. తనపై శ్రద్ధ చూపాలని డిమాండ్ చేయడం
విసుగు అభద్రతాభావం,తనమీద శ్రద్ధ చూపాలనుకోవడం, తనను ప్రేమగా చూడాలనుకోవడం
కోసం అలా ప్రవర్తిస్తారు. అప్పుడు వారిని చీవాట్లు పెట్టడం,తిట్టడం,అవమాన పడేటట్లుగా మాట్లాడటం,ఎగతాళి చేయడం,కావాలని నిర్లక్ష్యం చేయడం,మిగతావారినుండి వేరు చేయడం కాకుండా బిడ్డ పై శ్రద్ధ చూపడం, ఒక వ్యక్తిగా ఆసక్తి చూపడం, ఆసక్తికరమైన పనులు చేయడానికి ప్రోత్సహించడం, ఆటలలో పాలుపంచుకోవడం చెయ్యాలి.

8. భయపడటం
గతంలో భాద కలిగించిన అనుభవాలు, ప్రేమగా చూడట్లేదనుకోవడం, తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలనుకోవడం
పిల్లలకు భరోసా ఇచ్చేలా మాట్లాడాలి. బిడ్డ భయపడే పరిస్థితి, సంఘటనలను సంతోషంగల సంఘటనలుగా మార్చండి. నిజమైన ప్రమాదకరమైన సంఘటనలు అంటే ఏమిటో దానికి కారణాలు భోదించండి, తనకు తాను ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పండి.

9. దొంగిలించడం
అవసరాలు తీరకపోవడం, ఆకలి వేయడం, అనుకరించడం, తిరగపడటం.
వారికి సొంత వస్తువులకు, ఇతర వస్తువులకు తేడాలు చెప్పడం వారి అవసరాలు తీర్చుకునే విధంగా సంపాదించుకునేలా చేయడం. బిడ్డ పట్ల కఠినంగా ఉండకుండా ప్రేమగా ఉండటం. వారికి ఆసక్తి ఉన్న సృజనాత్మక అలవాట్లు పెంపొందించుకునేలా చేయటం. మంచి స్నేహితులయ్యే విధంగా సహకరించటం.

10. అబద్ధాలు చెప్పడం
అనుకరించడం, గొప్పల కోసం, శిక్షకు (దండనకు)భయపడటం వలన అబద్దాలు చెబుతారు.
చీవాట్లు పెట్టడం, తిట్టడం, తిరస్కరించడం, క్షమాపణ చెప్పమని అడగడం, చింతించే విధంగా చేయడం వంటి పనులు చేయరాదు. వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం.

11. ఇంట్లోనుండి పారిపోవడం
విసుగు, కోపం, స్వతంత్రంగా ఉండాలనుకోవడం, తిరగబడటం కోసం అలా పారిపోవాలనుకుంటారు. వారిని ఏడిపించడం, దండించడం, పదే పదే ఇంట్లో నుండి ఎందుకు పారిపోయాడో అడగడం చేయకుండా అతడు ఎక్కడ ఉన్నాడో కనుగొని అతడు పారిపోవడానికి కారణాలు అడగండి, అతనికి ఇంట్లోని కొన్ని విషయాలపై బాధ్యత అప్పగించండి, అతన్ని ఆకర్షించే ప్రత్యామ్నాయాలు కనుగొనండి. క్రమేణ అతనిపై ఉన్న పరిమితులు(restrictions) కొన్ని తొలగించండి.

12. తినడానికి ఇష్టపడకపోవడం
ఆకలి లేకపోవడం, ఆహారం నచ్చకపోవడం, అస్వస్థతగా ఉండటం వలన తినకపోవచ్చు. అప్పుడు బలవంతంగా తినిపించడం, పెద్ద సంఘటనగా చేయడం, తింటే ఏదైనా బహుమతి ఇస్తానని చెప్పడం చేయకూడదు.
మామూలుగా ప్రశాంతంగా ఉండటం, క్రొత్త క్రొత్త ఆహార పదార్ధాలను అలవాటు చేయడం, తనకు ఇష్టమైన ఆహార పదార్ధాలు ఇవ్వడం.

13. సమయంకు నిద్రపోకపోవడం
నిద్ర రాకపోవడం, తనపై శ్రద్ధ చూపాలని కోరుకోవడం,అసౌకర్యంగా ఉండటం, ఆసక్తి, కుతూహలం లేకపోవడం కారణాలు కావచ్చు.
చీవాట్లు పెట్టడం, తిట్టడం, భయపెట్టడం, ప్రతిఫలం ఇస్తానని చెప్పడం చెయ్యకూడదు.
బిడ్డను పడుకోబెట్టే ముందు అతనికి కొంత సమయం కేటాయించి, పడుకోబోయేముందు అతడు సరిగా తిన్నాడో, అతని అవసరాలు తీరాయో లేదో గమనించండి. ప్రేమగా అతన్ని బుజ్జగించి పడుకోపెట్టాలి.

పిల్లలలో సాంఘిక - వ్యక్తిగత వికాసము
సాంఘిక వ్యక్తిగత అభివృద్ధి కలిస్తేనే సామాజిక అభివృద్ధి జరుగుతుంది. పిల్లలకు సాంఘికాభివృద్ధి అనగా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, పరిసరాలలోని మార్పులకు అలవాటుపడడం, ఇతరులతో కలవడం, అనుగుణంగా నడుచుకోవడం, ఇతరుల అభిప్రాయాలను మన్నించడం, సహకరించడం, నాయకత్వం వహించడం మొదలగునవి.
పిల్లలు, పుట్టిన ఒక నెలకి వివిధ స్వరాలను పసిగడతారు.
ఇతరుల ముఖాలను తదేక దృష్టితో చూస్తారు.
రెండు మూడునెలల వయస్సుకు, పరిచితమైన వారిని చూసి నవ్వుతారు, ముఖ్యంగా తల్లిని.
ఆరు నెలల వయస్సు వచ్చే సరికి, తమ పరిసరాలలో, ప్రత్యేకించి కొందరు వ్యక్తులమీద మక్కువ ఏర్పరచుకుంటారు. ఇది వీరిలో రక్షణ, భద్రత లేక హామీ వంటి భావన కలుగజేస్తుంది.
తల్లిదండ్రులపై ప్రేమ, నమ్మకం, పెంచుకోవడం వలన పిల్లలు ఇతరులతో సాంఘీక సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.
ఏడాదిన్నర, రెండు సంవత్సరాల వయస్సులో పిల్లలు తమ తోటి వయస్సు పిల్లలతో స్నేహం చేస్తారు. తోటి వయస్సు పిల్లలతో స్నేహం ఆడుకుంటారే కాని, బొమ్మలు, ఇతర వస్తువులను మాత్రం స్నేహితులకివ్వరు.
రెండేళ్ళ వయస్సులో, తమంతటతామే ఆటలు ఆడుకుంటారు.
మూడేళ్ళ ప్రాయం వచ్చే సరికి, తన గురించి తెలుసుకోవడమే గాక తోటి వారు ఆడపిల్లా? లేక మగపిల్లాడా అనే కుతూహలం కూడా కనబరుస్తారు.
పుట్టినప్పటి నుండి 6నెలలు :
ఆకలి వేసినప్పుడు ఏడ్వడం, బాగా సంతోషంగా ఉంటే ఇంగా....ఇంగా ....అని అంటారు.
పెద్ద శబ్దాలకు ఉలిక్కిపడతారు.
సంతోషంగా ఉంటే శబ్దాలు చేస్తారు. కలతగా ఉంటే తొట్రుపాటు పడతారు.
తల్లిని పోల్చుకోగలుగుతారు.
ఏడుస్తున్నప్పుడు, ఎత్తుకొని హత్తుకోవడం వలన, శరీర స్పర్శతో వారికి కావలసిన ప్రేమ, లాలింపు కలుగుతుంది.
స్నానం, నిద్ర, ఆటలు, సాధ్యమైనంత వరకు నిర్ణీతమైన సమయంలో జరిగేలా చూడాలి.
కుటుంబములోని ఇతర సభ్యులతో కలిసే అవకాశం కల్పించాలి.
ఎత్తుకుని, లేదా తోపుడు బండిలో చుట్టు ప్రక్కల పరిసరాలను చూపించాలి.
6-12 నెలలు :
పరిచితమైన మనుష్యుల్ని పోల్చుకోవడం, పేరు పెట్టి పిలిస్తే ఆవైపుకి తిరగడం చేస్తారు.
వద్దు, టాటా అంటూ చేయి ఊపుతారు.
క్రొత్తవారు కనిపిస్తే ప్రక్కకు తిరిగిపోతారు, తల్లి వదిలి వెళ్తే అసంతృప్తి కనబరుస్తారు.
ఆటవస్తువులతో బిడ్డతో పాటు కూర్చుని ఆడాలి.
1-2 సంవత్సరాలు :
చిన్న చిన్న పదాలు ఉపయోగిస్తూ,లయబద్ధంగా కాళ్ళు, చేతులు కదిలిస్తూ పాటలు పాడతారు.
చిన్న చిన్న పనులు చెబితే చేస్తారు.
తోటి వయస్సు పిల్లలను చూసి నవ్వుతారు.
రెండేళ్ళు వచ్చేసరికి మలమూత్ర విసర్జనను ముందే తెలియజేస్తారు.
పిల్లలను కుటుంబ సభ్యులతో, తరచుగా ఇంటికి వచ్చే అతిధులను పరిచయం చేయాలి.
అతిధులను పెద్దవారిని ' నమస్తే ' అని గౌరవప్రదమైన మాటలు, చేతలతో పలకరించడం నేర్పించాలి.
స్వయంగా భోజనం చేయటం, నీళ్ళు త్రాగడం ప్రొత్సహించాలి.
ఇంట్లో తనకంటే చిన్న పిల్లలతో ఆడుకునేలా చూడాలి.
మార్కెట్ కు వెళ్ళేటప్పుడు, దారిలో కనిపించే వస్తువులు, మనుష్యులను, నిత్యం చూసే వాహనాలు, రోజూ వాడుకునే కూరగాయలు చూపించాలి.
ఇంట్లో ఉండే ఇతర సభ్యుల బంధుత్వం గురించి బిడ్డకు తెలియజేయాలి.

పిల్లలందరూ ప్రత్యేకమైన వారే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. వారి వారి సామర్ధ్యతలో, లక్షణాలలో, ప్రవర్తనలో భేదాలుంటాయి.

2-3 సంవత్సరాలు :
దుస్తులు వేసుకోవడం, తీయడంలో సహకరించడం.
తనంతట తాను భోజనం చేయడం, కంచం, గ్లాసు, చెంబు వంటి వస్తువులు పట్టుకోగలరు.
స్వయంగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోగలరు.
తనకు కావాల్సింది అడగడం, నిర్ణీత సమయం మరియు ప్రదేశంలో మలమూత్ర విసర్జన చేస్తారు.
బిడ్డ తన దుస్తులు తానే వేసుకోవడం, తీసుకోవడాన్ని ప్రోత్సహించాలి.
3-4 సంవత్సరాలు :
ఇతర పిల్లలతో, వారి ఆటవస్తువులతో ఆడటానికి ఇష్టపడతారు.
ఇతర పిల్లలకు తన ఆటవస్తువులనివ్వడం, పొరుగు వారితో కలిసి మెలిసి ఉండడాన్ని ప్రోత్సహించాలి.
పరిచయమున్న వారిని, వారి పేర్లతోను, వరుసతో పిలుస్తారు.
తమ దుస్తులు, ఇతరుల సహాయం లేకుండా వేసుకోగలుగుతారు.
చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడతారు.
4-5 సంవత్సరాలు :
చిన్న చిన్న ఇంటి పనులు చేయగల్గుతారు. పరిశుభ్రతకు సంబధించిన కొన్ని నియమాలను పాటించగలరు.
చొక్కా, గౌనుల గుండీలు సరిగ్గా పెట్టుకోగలరు.
తమంతట తామే పళ్ళు తోముకోగలరు.
ఏ కాలి చెప్పు ఆ కాలికి సరిగ్గా వేసుకోగలరు.
తల్లిదండ్రులకు సూచనలు :
పిల్లల సామాజిక అభివృద్ధి, వారు పెరిగే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కనుక పెద్దలు. పిల్లలలో క్రమశిక్షణ, మంచి అలవాట్లు, మర్యాద, మంచి భావాలను పెంపొందించాలి.
పిల్లలలో వ్యక్తిగత శుభ్రతను ప్రోత్సహించాలి.
మంచి ఆహార అలవాట్లు, వేళకు ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలి.
పెద్దలయెడల భయభక్తులను ప్రోత్సహించాలి.
తోటి స్నేహితులతో కలిసి ఆడడం, సహకరించడం వంటివి ప్రోత్సహించాలి.
సామూహిక కార్యకలాపాలలో పాల్గొనేలా చూడాలి.

(విజ్ఞానసాధిత సౌజన్యంతో)
Share this article :

2 comments:

  1. మంచి విషయాలు చెప్పారు

    ReplyDelete
  2. 3 to 6 years children's ki thoti pillalatho snehamgaa undadam yela neerpinchaali,dani valla uses, nastalu, please komchem matter gather chesi pettara, please nku chala arjent ga kavali, evening ki pettandi, today ki kavali

    ReplyDelete

Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||