Yogi Adityanath CM of UP

Mar 20, 2017



యోగి ఆదిత్యనాధ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఈయన 1972 జూన్ 5వ తేదీన జన్మించారు. వీరి అసలు పేరు అజయ్ సింగ్ బిష్ట్. వీరి తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఒక అటవీశాఖలో రేంజర్ గా పనిచేశారు. ఈయన హమ్వతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్శిటీలో గణితంలో డిగ్రీ చదువుకున్నాడు.
1990లో రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నాడు. గోరఖనాధ్ మఠం ముఖ్యనాయకుడైన మహంత్ అవైద్యనాధ్ వద్ద శిష్యునిగా చేరి తన పేరును యోగి ఆదిత్యనాధ్ అని మార్చుకున్నాడు.  మహంత్ అవైద్యనాధ్ తదనంతరం ఆ మఠానికి ముఖ్య నాయకుడైనాడు. 1949లో అయోధ్యలోని బబ్రీ మసీదును స్వాధీనం చేసుకున్న మహంత్ దిగ్విజయనాధ్ శిష్యుడు మహంత్ అవైద్యనాధ్య. మహంత్ అవైద్యనాధ్ శిష్యుడు యోగి ఆదిత్యనాధ్. 1980లో బీజేపీ అయోధ్యఉద్యమం లో ప్రవేశించిన తరువాత మహంత్ అవైద్యనాధ్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనాడు. 26 ఏళ్ళ వయసులో యోగి ఆదిత్యనాధ్ లోక్ సభకు ఎన్నికైనాడు. హిందూ యువ వాహిని అనే సంస్ధను స్థాపించాడు. బిజేపి యోగి ఆదిత్యనాధ్ ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించింది.

Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||