ప్రపంచ తెలుగు మహాసభలు

Dec 9, 2012

ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరగబోతున్నాయి సంతోషం. తెలుగుకు సభలెందుకు. అయినా ఇది తెలుగుకేనా ప్రపంచ హిందీ సహాసభలు, తమిళ, మళయాళ,ఒడిశా,బెంగాలీ... ప్రపంచమంతటా మాట్లాడే ఇంగ్లీషు బాషకే మహాసభలు లేవే.మరి తెలుగుకే ఎందుకు
...గూగులమ్మనడిగితే హిందీకి తొమ్మిదిదాకా జరిగాయని, తదితర భాషలకుకూడా యధాశక్తి జరుగుతున్నాయని చెప్పింది. తమిళంవాళ్ళయితే తమిళభాషలోని పదాలన్నీ తమిళంలో ఉన్నాయోలేదో పరిశీలించి తదనుగుణంగా మారుస్తున్నారట. కానీ తెలుగు వారు మాత్రం తెలుగును వదిలేసి ఆర్యుల సంస్కృతాన్నే తెలుగనుకుంటున్నారు. సంస్కృత భాషాభిమానులు కవులుగా , అధికారులుగా ఉన్నారుగనుక తెలుగు భాషను అణగద్రొక్కి తెలుగు భాషను సంస్కృత పదాలతో నింపుతున్నారు. ఫలితంగా తెనె వంటి తెలుగులో తేనెను కోల్పోతున్నాము.
యునెస్కో వారు ప్రకటించిన మృతభాషలు కాబోయేవానిలో తెలుగున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారుగానీ, ఏభాష తెలుగు భాషను అణగదొక్కుతుందో తెలుసుకోలేకపోతున్నారు.సంస్కృత భాషాభిమానులు తెలుగు భాషలో సంస్కృత పదాలతో నింపుతున్నందున తెలుగు భాష మృతభాష గాబోతున్నది. ఆసంగతి ప్రజలెక్కడ గమనించి తమ తాటతీస్తారోనని అంతటా ఇంగ్లీషు పేర్లుతో బోర్డులు పెడుతున్నారని, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తూ మరోప్రక్క ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ఎక్కువౌతున్నాయని, ఇలా నెపాన్ని ఇంగ్లీషు మీదికి తోస్తున్నారు. నిజానికి సంస్కృత భాషాదురభిమానుల, మతవాదుల, ప్రకృతివాదుల, తెలుగు భాషా పరిరక్షణ సంఘాల పేరుతో తెలుగును అణగద్రొక్కేవారిని ప్రజలు గుర్తించిన రోజున వారి పీచమడచి, తెలుగు వెలుగులు ప్రపంచ నలుదిక్కుల తమ తేనెల తెలుగును  ప్రసరింపజేయగలరు.
బొస్సొచ్చింది, కారెక్కాను, ఇలా ఇంగ్లీషు పదాలు తెలుగులో కలిపేసుకున్నాము. కానీ ఈ ఆర్యులు మాత్రం వారి సంస్కృత పదాలను తెలుగులో కలువనీరు. ఉదాహరణకు లక్ష్మి అనే సంస్కృత పదాన్నితెలుగులోకి మార్చినప్పుడు లచ్చిమి అని పలుకవచ్చు. కానీ ఈ ఆర్యసమాజం దాన్ని అంగీకరించదు. అలా ఏభాషలోని పదాలనైనా తెలుగులోకి మార్చుకోవడానికి అవకాశమిచ్చే వారే నిజమైన తెలుగు భాషాభిమానులు. తెలుగు భాష ను సంస్కృత భాషగా మార్చేవారు కోవర్టులు. కోవర్టులకు వ్యతిరేకంగా పోరాడడమే మనం చేయవలసిన పని. సంస్కృత భాష ప్రాకృతభాషలోని పదాలను స్వీకరించి వాటిని సంస్కృత భాషలోనికి మార్చుకొని భాషను సుసంపన్నం  చేసుకున్నారు. కానీ వారే నేడు ఆ సంస్కృత పదాలను తెలుగులోకి మార్చుకోవడానికి అంగీకరించడంలోదు. ఉదాహరణకు ప్రాకృత భాషలో రచించబడిన ఈ పద్యం చూడండి.  " జాయా పితిబ్బసా  నారీ దత్తా నారీ పతివ్వసా, వివాహ పుత్తవసా నారీ నత్థి నారీ సయం వసా " దీనిని సంస్కృతంలోకి ఎలామార్చుకొని ఫోజులిచ్చారో మీకెరికేగదా. ఆర్యుల రచనలన్నీ ప్రాకృత భాషలో వ్రాయబడిన జైనుల రచనల కాపీ పేష్టులే.

తెలుగు భాషను ఆంగ్లభాషవలే పరభాషలాగా మార్చివేశారు. పర్యాయపదాలు, నానార్ధాలు మొదలైనవన్నీ సంస్కృత పదాలే. కనుక తెలుగును పరభాషలాగా నేర్ఛుకోవాల్సివచ్చింది. మమ్మీ,డాడీ అంటూ ఏదైనా ఒక్క ఇంగ్లీషు పదము మాట్లాడితే కొంపలు మునిగిపోయినట్లు గౌగౌ అంటూ ఎగురుతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకునే తెలుగు విద్యార్ధులకు ఇంగ్లీషు భాష అలవడడానికై ఇంగ్లీషులోనే మాట్లాడాలని నియమాలు చెయ్యడం తప్పుకాదు. తెలుగు క్లాసులోనూ, తెలుగు ఉపాధ్యాయునితోనూ తెలుగులో మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. ఇదేదో క్రూరమైన నియమములాగా , తెలుగు భాషను అణగద్రొక్కడానికి చేసే పనిలాగా భావించడం తెలివితక్కువ తనం. తెలుగు మాండలీకాలను ఆర్యజాతి వారు అవమానిస్తున్నారు. తెలుగు మాండలీకాలలో మాట్లాడిని వారిని హేళన చేస్తున్నారు. తెలంగాణా వారు తెగబడి వారి మాండలీకంలోనే బహిరంగాంగా ధైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ కోస్తాప్రాంతంవారింకా భయపడుతూనేవున్నారు. గోదావరి ప్రాంత తెలుగు మాండలీకాన్ని నీచపాత్రలచే పలికిస్తున్నవిధానాన్ని తెలుగు ప్రజలు ఎదిరించాల్సిఉంది. ఈ ప్రాంత మూలనివాసులైన మనల్ని ఆర్యులు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. వాని అనుమతి లేకుండా మనమేమీ చెయ్యడానికి లేదు. మనం ఏమేమి చెయ్యాలో వాడు నిర్ణయిస్తున్నాడు. మనం ఏరోజు పెళ్ళి చేసుకోవాలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో వాడే నిర్ణయిస్తున్నాడు. వాడు గీచిన గీటు దాటే సాహసం మనకు లేకుండా పోయింది. దేవుని పేరుతోనూ, మతం పేరుతోనూ వారు మనలను బానిసలుగా చేసుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలంటూ దానిలోకి కూడా మతాన్ని తెస్తున్నాడు. భాషకు మతానికి సంబంధం ఉందా? తెలుగు భాషపై తెలుగు వారికి లేని హక్కులు ఆర్యులకు ఎవరిచ్చారు? పండితులుగానూ, అధికారులుగానూ ఆర్యులే ఉన్నారు గనుక వారి పెత్తనం ఎదురులేకుండా సాగుతుంది. ఈ బానిస బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు ? ఆర్యులకు మన మీద పెత్తనమేమిటి?  గాంధీ వంటి మరో గొప్ప నాయకుడు పుట్టి తెలుగు భాషను విదేశీయుల దౌర్జన్యాన్ని ఎదిరించాల్సిదేమో. ఎందుకంటే ప్రస్తుతం మనము వాళ్ళ అదుపాజ్ఞలలో నడుస్తున్నాము. తెలుగు భాష ను ఆర్యుల చెరనుండి విడిపించడానికి మీవంతుగా మీరేమి చెయ్యాలనుకుంటున్నారు?
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||