డోనాల్డు ట్రంపుగారు ఎంపిక పెద్దల మొగ్గు ఓట్లతో గెలిచాడు.

Dec 20, 2016



డోనాల్డు ట్రంపుగారు ఎంపిక పెద్దల మొగ్గు ఓట్లతో గెలిచాడు.
తెల్ల కోటలో అడుగు పెట్టనీయకుండా ఆపాలనే చివరి ప్రయత్నమూ విఫలం కావడంతో అమెరికా రాష్రాలకట్ట యొక్క అధ్యక్ష ఎంపిక పెద్దలు డోనాల్డు ట్రంపు గారిని దేశాధ్యక్షునిగా అంగీకరించారు. ఎన్నికలలో గెలిచిన ఆరు వారాల తరువాత రిపబ్లికన్లకు తమ విజయానికి అవసరమైన 270 ఓట్లు పడ్డాయి. ఈ విజయానికి బదులు చెబుతూ శ్రీ డోనాల్డు ట్రంపుగారు తాను అందరు అమెరికావారికీ అధ్యక్షుడననీ, దేశ ఐక్యత కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు.



కోటీశ్వరుడైన వానిని గెలిపించవద్దని ఎంపిక పెద్దలను కోరుతూ ఈ-ఉత్తరాలూ, ఫోను పిలుపులూ వెల్లువెత్తాయి. ఈ ఎన్నిక ఓటింగు నామమాత్రమే అయినా రష్యాహాకర్లు అధ్యక్ష ఎన్నికలపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నించారనే నీలి వార్తల ప్రచారం ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోననే భయాలు వ్యాపించాయి. టెక్సాస్ లోని ట్రంపు పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిక పెద్దలు చివరికి తమ ఓటును ట్రంపుకు వ్యతిరేకంగా వేసి 270 ఓట్లతో ట్రంపును ఓటమి ముంగిట నిలిపారు. నలుగురు డెమొక్రాటుకు చెందిన ఓటర్లు కూడా తమ ఓటును శ్రీమతి క్లింటను గారికి బదులుగా మరొకరికి వేశారట. ఫలితాలపై అధికారిక ప్రకటన జనవరి 6వ తేదీన జరగబోయే ప్రత్యేక సంయుక్త సమావేశ కార్యక్రమంలో వెల్లడిస్తారు. " మనం దానిని సాధించాము. నా మద్దతుదారులందరికీ ధన్యవాదములు. "   అని ట్రంపు గారు ట్వీట్ చేశారు.   
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||