Long queues at banks and ATMs is the victory symbol for Indian Block Money holders

Nov 19, 2016


Image result for long queue at atm


Long queues at banks and ATMs is the victory symbol for Indian Block Money holders


భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ దేశంలోని నల్ల ధనాన్ని నాశనం చెయ్యడానికి తలపెట్టిన ఐదొందలూ వెయ్యీ నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు జరగనీయకుండా నల్ల దొరలు విజయం సాధిస్తున్నారనడానికి ఇప్పటికీ బాంకుల వద్ద ఏటీయమ్ముల వద్ద కనిపిస్తున్న పెద్ద క్యూలే నిదర్శనం.


ప్రధానమంత్రి నిర్ణయాన్ని బీజేపీ సభ్యులూ, నాయకులూ, మిత్రపక్షాలూ చివరకు కేంద్ర మంత్రులు కూడా బలపరచిన దాఖలాలు కనిపించడం లేదు. ఇది నల్ల దొంగలపై జరుగుతున్న యుద్ధంగనుక కేవలం పేపరు ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రతి పోలీసూ ఓ నల్లదొంగను పట్టించాలనే ఆతృతను కనబరచగలగాలి. కనుకనే ఈ దశలో ప్రధానికి రాజనాధసింగు గారి సహకారం అవసరం.

ఇంతకూ నల్లదొంగలను ఎలా గుర్తించాలి? దొంగలంటే గళ్ళలుంగీ కట్టుకుని బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతూ కనిపిస్తారా లేదుగదా ఎవరైతే చిల్లర నోట్లను చలామణిలోకి రానియకుండా దాచేస్తున్నారో వాళ్ళ ప్రస్తుత నల్ల దొంగలు. వీరు తమ వద్దనున్న వందలు యాభైలు వంటి చిల్లర నోట్లను దాచేసుకుంటున్నారు. తమ వద్ద వందల నోట్లు ఉన్నాగానీ లేవని అబద్ధం చెబుతున్నారు. అటువంటి వారిని ప్రజలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం ద్వారా ఈ నల్ల దొంగలపై గెలవగలుగుతాము.

ప్రభుత్వ రవాణా సంస్ధలైన బస్సుల్లో పాత ఐదొందలు వెయ్యిలకు చిల్లర లేదనే సమాధానం వస్తుంది. ఆ వందల నోట్లన్నీ నల్ల దొంగలకు చేరుతున్నాయి. బాంకులకు రావడం లేదు. పెట్రోలు బంకుల వద్ద, పాల బూతుల వద్ద కూడా ఇంతకు మించి మరేమీ జరగడం లేదు. పాత ఐదొందలూ వెయ్యీ నోట్లను తీసుకునే అధికారమున్న వ్యక్తులు, సంస్ధలు ప్రజల వద్దనుండి అవి తీసుకొంటున్నవారు ఎంతమందో లెక్కఉన్నదా? ఉదాహరణకు ఏదైనా పాలబూతుకు వెళ్ళి పాత ఐదొందల నోటు ఇచ్చి రెండు పాల పాకెట్లు తీసుకుంటే మిగిలిన నాలుగొందల యాభై ఇస్తున్నారా... లేదు. చిల్లర లేదు అంటున్నారు. కానీ వారు బాంకులో పాతనోట్లే జమచేస్తున్నారు ఎలా ?

ఎవరికివారు మనకెందుకులే అనే ఆలోచనలో ఉండడానికి కారణమేమిటంటే ఒకవేళ మనం దొంగని పట్టిచ్చినా వాళ్ళకు శిక్ష పడుతుందో లేదో గాని మనకు అనేక ఇబ్బందులు తప్పవుఅని తెలుసుగనుకనే. ప్రభుత్వమంటేనే అనేకరకాల దొంగల సముదాయమా అన్నట్లుగా ఉంది. పాత బ్రిటిష్ చట్టాల ప్రకారం దొరకనివాడు దొరేగదా.
పూర్వం ఎంటీరామారావుని కూడా హోటళ్ళవాళ్ళు ఇలాగే అవమానిస్తే ఎవరూ పట్టించుకోలేదు. పార్టీవాళ్ళుగానీ, పోలీసులు గానీ, పేదలుపేదలూ అని గొంతు చించుకునేవాళ్ళుగానీ ఎవరూ పట్టించుకోలేదు అదేదో ఆయన వ్యక్తిగత నిర్ణయంలోగా .


పరిసరాల్ని పాడుచేసేవారిని శిక్షించకుండా స్వచ్చభారత్ ఎలాగా సక్సెస్ కాదో నల్ల దొంగలకు సరైన శిక్షా వారిని పట్టించిన వారికి తగిన బహుమానం ఉంటేనే ఫలితాలు ఆశించినట్లుగా వస్తాయి.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||