18ఏళ్ళలోపు పలావు నిషేధం

Apr 27, 2012



18 ఏళ్ళ లోపు స్త్రీలు పలావు తినరాదని భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇంతకు ముందు ఈ నిషేధం లేదు. పలావు తినడం వారికి ఇష్టమైతే తినవచ్చు.
కానీ వారికి ఇష్టం లేకుండా బలవంతంగా ఎవరైనా పలావు తినమని బలవంతం చేస్తేమాత్రం అది నేరమేనంటూ పాత చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర మంత్రిమండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఇది 18 సంవత్సరాలలోపు బుడ్డి పిల్లకాయలకు రక్షణ కల్పించేందుకు ఈ గొప్ప చట్ట నవరణ చేశారు . ఈ  చట్టం గురించి విని అమెరికా, సింగపూర్ వంటి దేశాలు అభినందించాయి. పిల్లకాయలకి ఆటవస్తువులు కూడా ప్రభుత్వం సబ్సిడీ రేట్లకి సప్లై చేస్తే , అప్పుడుదాకా వాటిని వాడుకుంటారని సూచించాయి.  మానవ శరీరంలోని ఓ ముఖ్యభాగానికి పదిపన్నెండేళ్ళకఠిన శిక్షవిధించడం తగదని ఏవోక్క ప్రతిపక్షనాయకుడు కూడా ఆటంకం చెప్పకపోవడం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. పది పన్నెండేళ్ళ శిక్ష విధింపబడేంత తప్పు వారేంచేశారు ? ఎందుకని వారి కాహక్కులు నిషేధించబడ్డాయి? వాలంటైన్స్ డేని, ప్రేమను మనదేశంనుండి తరిమేయాలనుకుంటున్నారా?
ఎందువలన ఈ చట్టం చేయబడిదో అని ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే మహిళల సమస్యలకు 18ఏళ్ళలోపువారికి సంబంధం ఏమిటి? మహిళల సమస్యలు పరిష్కరించడానికి తగిన చట్టరక్షణ కల్పించడానికి బాగా ఆలోచనచేసిచేసిచేసి 18 ఏళ్ళలోపువారిపైన నిషేధం విధించడం ఎలాజరిగింది? యువకులపైన ప్రేమికులపైన పాలకులకుగల ద్వేషభావం దీనిద్వారా తెలుస్తుంది.  ప్రజలు కొన్నాళ్ళే పనిచేయాలని తర్వాత రిటైర్ కావాలని చట్టాలు చేసే పాలకులు తాము మాత్రం చచ్చేదాకా పదవిపట్టుకు వేళ్ళాడుతారు. యువకులను అమాయకులని , నిస్సహాయులని, దద్దమ్మలని , తామేమిచేస్తున్నామో తెలుసుకోలేని తెలివితక్కువ వారుగా ఈ పాలక వృద్ధజంబుకాలు తలపోస్తున్నాయా? చట్టరక్షణ పేరుతో యువకుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హరిస్తారా?  మహిళా శిశు సంక్షేమశాఖకు యువకుల రక్షణ గురించి సిఫారసు చెయ్యడమేమిటి ? యువకులను శిశువులుగా భావిస్తున్నారా ఏమిటి?  

 ఇది నిరంకుశ చర్య. ఈ శతాబ్దపు గొప్ప అనాగరికమైన పని. చట్టసభలలో స్త్రీల రిజర్వేషన్ బిల్లు ఆమోదించడానికి సిద్ధంగా లేరుగానీ, పాపం స్త్రీలపై ప్రేమ కడవలకొద్దీ వొలకబోస్తున్నారు. గత 125 సంవత్సరాలుగా భారతీయుల్ని మోసగిస్తున్నవారు 18ఏళ్ళలోపు స్త్రీలను మోసగించడం అత్యంత సులువైన విషయంగా భావించడం అంటే వారిని అవమానించడమే. బాలల హక్కుల పేరుతో బాలబాలికల హక్కులకు భంగము కలిగించే ఆలోచనే. ప్రతి పౌరుడూ తప్పనిసరిగా చట్టాన్ని అతిక్రమించేలా చట్టాన్ని రూపొందించే పనులలో ఇది ఒకటి. భారతీయ బాలికలను విదేశీ వికృత పోకడలకు అనుకూలంగా అంతర్జాతీయ విపణిలో అమ్మకానికి పెట్టే పని ఇది. కామాంధుల ఫ్యాషన్ ప్రపంచానికి భారతీయ యువతులను అంగడి సరుకుగా మార్చే దుష్ట ఆలోచన ఇది. బాలబాలికల ప్రాధమిక హక్కుకు గొడ్డలిపెట్టు ఈ వికృత ఆలోచన. శాడిష్టుల చిరకాలపు కోరిక ఇట్టిదే కదా. మహా నీచుడని , దుష్టపాలకుడని  పేరుపొందిన ఏ పాలకుడు కూడా ఇంతటి క్రూరమైన చట్టం ఇంతకు మునుపెన్నడు చేసి ఎరుగడు. ఏసీ గదుల శీతలానికి మెదడు ఘనీభవించిన ఫలితంగా ఇట్టి విపరీతనిర్ణయాలు తీసుకునియుంటారేమో. రాహులునివలే 40ఏళ్ళ వయసు వచ్చే వరకూ ఇండియాలో ఎవరూ  వివాహితులు కారాదని కూడా నిషేధిస్తారేమో. వినాశకాలే విపరీతబుద్ధి అంటే ఇదేనేమో.

Share this article :

2 comments:

  1. మీరు అసలు విషయం నేరుగా చెప్పకుండా డొంకతిరుగుడుగా చెప్పడం వల్ల ఈ పోస్టులో కాస్తంత క్లారిటీ తగ్గింది. నిజమే. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఆ చేసేదేదో 18 ఏళ్ళకు బదులుగా 28 ఏళ్ళకు చేసేస్తే ఓ పని అయిపోయేది కదా. ఎంచక్కా అందరూ ప్రేమా, దోమా లేకుండా సన్యాసం తీసుకొని ఏ బాదరబందీ లేకుండా బ్రతికెయ్యొచ్చు.

    ReplyDelete
  2. Chala Baga Raasaru...Palavu enduku tinoddabba ladies ani burra baddalu kottukunna....polika chala baga kudirindhi :) Na varakaite edi meeru annattuga vaalla Hakkulni Harinchatame....Meerannattu women reservation ni implemenat cheyyatledu ...ela panikimaalina chattalu chestunnaru Raaja keeyalloki youth vachentavaru politics elane vuntayi.....!

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||